Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబరిమలలో భక్తులు లేకుండానే ఆ పూజ.. ఏంటది?

కేరళలో భారీ వరదల కారణంగా శబరిమల మునిగిపోయింది. ఈ క్రమంలో శబరిమల ఆలయంలో ఏటా నిర్వహించే నిరపుతిరి వేడుకలు ఈ ఏడాది అత్యంత సాదాసీదగా నిర్వహించారు. ఆలయానికి వచ్చే దారుల్లోని నదులు పొంగి ప్రవహిస్తూ ఉండటంతో

Written By selvi
Updated: సోమవారం, 20 ఆగస్టు 2018 (10:58 IST)
కేరళలో భారీ వరదల కారణంగా శబరిమల మునిగిపోయింది. ఈ క్రమంలో శబరిమల ఆలయంలో ఏటా నిర్వహించే నిరపుతిరి వేడుకలు ఈ ఏడాది అత్యంత సాదాసీదగా నిర్వహించారు. ఆలయానికి వచ్చే దారుల్లోని నదులు పొంగి ప్రవహిస్తూ ఉండటంతో ఈ ఏడాది భక్తుల రాకపై ఆంక్షలు విధించారు. దీంతో ఆలయ చరిత్రలోనే తొలిసారి భక్తులు లేకుండా ప్రతిష్టాత్మక పూజలు జరిగాయి.
 
కేరళను అతలాకుతలం చేస్తున్న వర్షాలు శబరి అయ్యప్ప స్వామి ఆలయంపైన కూడా ప్రభావం చూపాయి. ఏటా సాగుకు ముందు వరి కంకులను తెచ్చి స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం రైతులకు వీటిని అందజేస్తారు. దీనివల్ల పంటలు బాగా పండుతాయని రైతులతో పాటు స్థానికుల నమ్మకం. అయితే ఈ ఏడాది పంపానది పొంగిపొర్లుతూ ఉండటంతో భక్తుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. 
 
నిరతి పూజ కోసం ఆగస్టులో ఆలయాన్ని తెరుస్తారు. బాజాభజంత్రీల నడుమ మంగళ వాయిద్యాల మధ్య అత్యంత వైభవంగా వేడుకను నిర్వహిస్తారు. ఆలయ వర్గాలతో రాష్ట్రవ్యాప్తంగా ఉండే రైతులు, వివిధ ప్రాంతాల ప్రజలు ఈ పూజ కోసమే ఇక్కడకు వస్తారు. అలాంటిది వరదల కారణంగా  తొలి సారి అత్యంత సాధారణంగా జరిగిందని ఆల నిర్వాహకులు అంటున్నారు.  
 
ఆలయ చరిత్రలోనే తొలిసారిగా ఇలా జరిగిందని.. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని పూజను వాయిదా వేయాలని ప్రయత్నించిన సాధ్యం కాలేదని ప్రకటించింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే భక్తులు లేకుండానే పూజలు నిర్వహించాల్సి వచ్చిందంటూ ఆలయ నిర్వాహకులు ప్రకటించారు. 

అన్నీ చూడండి

దుండిగల్ గ్రామంలో బయల్పడిన తెలుగు-కన్నడ లిపితో కూడిన శాసనం

హైదరాబాద్‌లో జోరుగా కల్తీ నెయ్యి విక్రయాలు - 36 టన్నుల కల్తీ నెయ్యి స్వాధీనం (Video)

ప్రసాదం ఇస్తామని ఇంటికి రప్పించుకుని... బంగారం, నగదు కొట్టేసిన జంట అరెస్ట్

మూడో బిడ్డకు కూడా 12 వారాల ప్రసూతి సెలవులు ఇక 365 రోజులకు పెంపు

హర్మూజ్ జలసంధి మాదే... అమెరికా కొత్త భూభాగ మ్యాప్‌ను రిలీజ్ చేసిన ట్రంప్

అన్నీ చూడండి

19-08-2026 బుధవారం నాటి మీ రాశి ఫలితాలు - దంపతుల మధ్య స్వల్ప కలహం

శ్రావణ మంగళవారం రోజున ఇలా పూజిస్తే.. సర్వం శుభమే

18-08-2026 మంగళవారం నాటి మీ రాశి ఫలితాలు - కష్టించినా ఫలితం శూన్యం

Shasti Vrat: షష్టి వ్రతాన్ని ఆరు మాసాలు ఆచరిస్తే.. ఏంటి ఫలితం?

17-08-2026 సోమవారం ఫలితాలు - ఈ రోజు కలిసివచ్చే సమయం..

తర్వాతి కథనం
Show comments