శనివారం, 23 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 20 మార్చి 2021 (12:54 IST)

కమనీయం.. రాముల వారి సర్వభూపాల వాహనం

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన శ‌ని‌వారం ఉదయం ర‌థోత్స‌వం బ‌దులు సర్వభూపాల వాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు. కోవిడ్ -19 నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మం ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.
 
సర్వభూపాలురు అంటే అందరు రాజులు అని అర్థం. ''రాజా ప్రజారంజనాత్‌'' అన్నట్లు ప్రజలను రంజింపజేసేవారే రాజులు. ఈ రాజులందరికీ రాజాధిరాజు భగవంతుడు.
 
వాహన సేవ అనంతరం ఉదయం 9 నుండి 10 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వ‌హించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబరి నీళ్ళతో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు.
 
కాగా సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ నిర్వహించనున్నారు. రాత్రి 8.00 నుండి 9 గంటల వరకు అశ్వ‌ వాహనసేవ జరగనుంది.