సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 14 జులై 2020 (23:09 IST)

శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. ఎందుకు చేశారంటే..?

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 16వ తేదీన సాలకట్ల ఆణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని ఈరోజు ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించారు. ఆలయాన్ని శుద్ధి చేశారు సిబ్బంది. 
 
సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం టిటిడికి ఆనవాయితీగా వస్తోంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. 
 
అందులో భాగంగా ఈరోజు కూడా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్‌తో పాటు తిరుమల టిటిడి ప్రత్యేక కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డిలు, టిటిడి ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.