1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. Lord venkateswara brahmotsavas in rishikesh

మే 19 నుంచి రిషికేష్‌లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు... టిటిడి ఈఓ సాంబశివరావు

Lord venkateswara brahmotsavas in rishikesh
రిషికేష్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మే 19వ తేదీ నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించడానికి టిటిడి సిద్ధమైంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏ విధంగా నిర్వహిస్తారో అదేవిధంగా రిషికేష్‌లో కూడా టిటిడి వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించనుంది. మే 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగునున్నాయి. 
 
బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను టిటిడి కార్యనిర్వహణాధికారి సాంబశివరావు విడుదల చేశారు. 19వతేదీ ధ్వజారోహణం, 20వ తేదీ చిన్నశేష వాహనం, 23వ తేదీ గరుడవాహనం, 24వ తేదీన హనుమంత వాహనం, 26వ తేదీ రథోత్సవం, కళ్యాణోత్సవం, 27వ తేదీ చక్రస్నానంలను టిటిడి నిర్వహించనుంది. టిటిడికి చెందిన వేదపండితులు రిషికేష్‌కు తరలివెళ్ళనున్నారు.
తర్వాతి కథనం
భక్తులు లేక బోసిబోయిన తిరుమల గిరులు