1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Updated : బుధవారం, 27 ఏప్రియల్ 2016 (11:13 IST)

భక్తులు లేక బోసిబోయిన తిరుమల గిరులు

కలియుగ వైకుంఠం తిరుమల ఖాళీగా కనిపిస్తోంది. వేసవి సెలవులు వదిలినా భక్తులు మాత్రం తిరుమలకు రావడం లేదు. ఎండతీవ్రత ఎక్కువగా ఉండటంతో భక్తులు తిరుమల క్షేత్రానికి కరువయ్యారు. బుధవారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 
 
అలాగే కాలినడక భక్తులు రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాలినడకతో పాటు సర్వదర్శనం భక్తులకు రెండు గంటల్లోనే శ్రీవారి దర్శన భాగ్యం లభిస్తోంది. మంగళవారం శ్రీవారిని 68,363 మంది భక్తులు దర్శంచుకోగా హుండీ ఆదాయం రూ.2.31 లక్షలుగా వచ్చింది.