మానససరోవరంలో అద్భుత కాంతులు: భూలోక కైలాసంలో..?
భూలోక కైలాసంలో అద్భుత కాంతులు.. యూ ట్యూబ్‌లో..?
కైలాస మానస సరోవరంలో కొత్త వెలుగులు యాత్రికులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. చిమ్మ చీకట్లో సుదూరం నుంచి మూడు చోట్ల కాంతులు వెలుగుతూ ఈ వీడియోలో దర్శనమిచ్చాయి. కైలాస మానస సరోవరం సౌందర్య నిలయమే కాదు.. భూమిపై అత్యంత అందమైన ఈ ప్రాంతం పరమశివుడి నివాసంగా ప్రసిద్ధి చెందింది. సముద్ర మట్టానికి 19,500 అడుగుల ఎత్తులో ఉన్న కైలాస మానస సరోవరానికి అత్యంత భక్తిశ్రద్ధలతో అనేక మంది వెళ్తూ ఉంటారు.
ఈ మానస సరోవరంలో పవిత్ర స్నానమాచరించి అలౌకిక ఆనందం పొందుతారు. ఈ నేపథ్యంలో అదృశ్య కాంతులు ప్రసరించాయని కొందరు యాత్రికులు గుర్తించినట్లు కొందరు చెప్తున్నారు. ఆ దృశ్య కాంతులు ఇవేనంటూ యూట్యూబ్‌లో ఓ యాత్రికుడు వీడియోను పోస్టు చేశారు. భూలోక కైలాసంలో శివరాత్రి సందర్భంగా ఈ కాంతి చోటుచేసుకోవడం యాత్రికుల భక్తిపారవశ్యంలో ముంచెత్తింది.
