మంగళవారం, 14 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 25 సెప్టెంబరు 2016 (16:17 IST)

2016 అక్టోబరు నెలలో ఎన్ని విశిష్టతలు.. విశేషాలున్నాయో తెలుసా?

వచ్చేనెల అక్టోబరు. ఈనెల ఎన్నో విశిష్టతలను కలిగివుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అక్టోబరు నెల ఉండనుంది. ఇలా విశిష్టతలు ఒకే నెలలో రావడం చాలా అరుదు. అవేంటో ఓసారి చూద్ధాం.

వచ్చేనెల అక్టోబరు. ఈనెల ఎన్నో విశిష్టతలను కలిగివుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అక్టోబరు నెల ఉండనుంది. ఇలా విశిష్టతలు ఒకే నెలలో రావడం చాలా అరుదు. అవేంటో ఓసారి చూద్ధాం. 
 
ఈనెలలో ఐదు ఆదివారాలు, ఐదు సోమవారాలు, ఐదు శనివారాలు వస్తున్నాయి. అంటే ఆదివారాలు 2, 9, 16, 23, 30 తేదీల్లో రాగా, సోమవారాలు 3, 10, 17, 24, 31 తేదీల్లోనూ, శనివారాలు 1, 8, 15, 22, 29 తేదీల్లో వస్తున్నాయి. ఇలా ఒకే నెలలో ఐదు చొప్పున ఆది, సోమ, శనివారాలు రావడం చాలా అరుదు. 
 
ఇక్కడ చెప్పుకోదగిన విషయమేమిటంటే... ఒక నెలలో ఒకే వారం అంటే ఆదివారమే పౌర్ణమి(16న), అమావాస్య (30న) వస్తుంది. అలాగే ఐదు ఆదివారాలు, మూడు పండుగలు, ఓ రెండో శనివారం కలిపి తొమ్మిది రోజుల పాటు సెలవులు రానున్నాయి. 
 
అంతేకాకుండా, ఈ మాసంలోనే వరుసగా బతుకమ్మ, దసరా, దీపావళి, పీర్లపండుగలు వస్తున్నాయి. 11న దసరా, 12న పీర్లపండుగ, 30న దీపావళి పండుగ పర్వదినాలు ఉన్నాయి. సాధారణంగా ఈ పండుగలు ఒకే నెలలో రావు.