Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఈ యేడాది రెండు బ్రహ్మోత్సవాలు..!

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో టిటిడి అధికారులతో ఈఓ సమావేశమయ్యారు. ఈ యేడాది రానున్న రెండు బ్రహ్మోత్సవా

Written By TJ
Updated: మంగళవారం, 31 జులై 2018 (21:29 IST)
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో టిటిడి అధికారులతో ఈఓ సమావేశమయ్యారు. ఈ యేడాది రానున్న రెండు బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయని చెప్పారు. సెప్టెంబర్ నెలలో ఒక బ్రహ్మోత్సవం, అక్టోబర్ నెలలో మరో బ్రహ్మోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. 
 
సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 12వ తేదీ నుంచి 21వ తేదీ వరకు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్నామని చెప్పారు. వాహన సేవలు యధావిధిగా ఉదయం రాత్రి వేళల్లో ఉంటాయన్నారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు 7 లక్షల లడ్డూలను అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. పది రాష్ట్రాల నుంచి కళాకారులు కూడా బ్రహ్మోత్సవాలకు హాజరవుతున్నట్లు చెప్పారు. ఆగష్టు 31వ తేదీలోగా బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేస్తామని చెప్పారు.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Meenakshi Temple: చారిత్రాత్మక ఘట్టం.. మధురై మీనాక్షి అమ్మవారి మహా కుంభాభిషేకం (video)

17-09-2020 గురువారం నాటి రాశి ఫలాలు - ఆర్థికంగా అనుకూలమైన రోజు

గురువారం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే?

బుధవారం.. వినాయకుడిని, బుధ గ్రహాన్ని పూజిస్తే.. ఆకుపచ్చ రంగులో...?

16-09-2020 రాశి ఫలాలు - వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి

తర్వాతి కథనం
Show comments