తిరుమలలో దళారీ అరెస్టు... రూ. 20,000 ఉడాయించిన వ్యక్తి...
తిరుమలలో భక్తులకు అధిక ధరకు శ్రీవారి సేవా టికెట్లు తీసిస్తానని నమ్మించి రూ.20 వేల రూపాయలతో ఉడాయించిన ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతికి చెందిన మురళి అనే వ్యక్తి నెల్లూరుకు చెందిన ఒక భక్త బృందంకు సుప్రభాతం టికెట్లు ఇప్పిస్తానని చెప్పి 20 వేల రూపాయలు తీసుకున్నాడు.
బుధవారానికి టికెట్లు తీసిస్తానని భక్త బృందాన్ని నమ్మించాడు. అయితే మంగళవారం రాత్రి ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి కనిపించకుండా వెళ్లిపోయాడు. దీంతో భక్తులు తిరుపతి ఈస్ట్ పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిని ఈస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
