శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Updated : శనివారం, 21 మే 2016 (12:40 IST)

తిరుమల భక్తుల రద్దీ రద్దీ... కంపార్ట్‌మెంట్లన్నీ ఫుల్

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. భక్తులతో తిరుమల గిరులు మొత్తం కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ చూసినా భక్తులే..భక్తులు. దర్శన కంపార్టుమెంట్ల నుంచి గదులు, తలనీలాలు ఇచ్చే ప్రతి ప్రాంతంలోనే భక్తులు కనిపిస్తున్నారు. శనివారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. సర్వదర్శనం కోసం ఉదయం 5 గంటల నుంచి అన్ని కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 
 
కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయి క్యూలైన్లు బయటకు వచ్చేశాయి. కాలినడక భక్తులు 8 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వారికి 5 గంటల్లో దర్శనం కల్పిస్తామని తితిదే చెబుతోంది. అయితే సర్వదర్శనం కంపార్టుమెంట్లలోని భక్తులకు 12 గంటల్లోగా దర్శనం కల్పిస్తామని తితిదే చెబుతోంది. అయితే అంతకుమించి సమయం పట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 
 
భక్తులు గదులు దొరక్క రోడ్లపైనే సేదతీరుతున్నారు. సీఆర్‌ ఓ కార్యాలయం, ఎంబిసి-34, పద్మావతి విచారణ కార్యాలయాన్నింటిను గదుల కోసం భక్తులు పడిగాపులు కాస్తున్నారు. శనివారం శ్రీవారిని 75,148 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం 2 కోట్ల 14 లక్షల రూపాయలు లభించింది.