1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. tirumala pilgrims crowd

తిరుమలలో మోస్తారు రద్దీ.. ఐదు గంటల్లోనే శ్రీవారి దర్శనం

tirumala pilgrims crowd
తిరుమలలో మోస్తారు భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం మధ్యాహ్నం తిరుమలకు చేరుకున్న భక్తులకు దర్శనం కాకపోవడంతో కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. సోమవారం ఉదయానికి సర్వదర్శనం కోసం 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి 5 గంటల్లో శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతోంది.
 
కాగా, కాలినడక భక్తులు మూడు కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి దర్శన సమయం 3 గంటల సమయం పడుతోంది. తిరుమలలోని అతిథి గృహాల గదులు సులభంగానే లభిస్తున్నాయి. మరోవైపు ఆదివారం శ్రీవారిని 81,417 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.7 కోట్ల మేరకు వసూలైంది. 
About Writer
ttdj
తర్వాతి కథనం
రేపటి నుంచి తిరుపతి గంగమ్మ జాతర.. శ్రీవారి చెల్లెలుగా ప్రసిద్ధి...