తిరుమలలో కొనసాగుతున్న రద్దీ... శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం...
తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. శనివారం కావడంతో తిరుమలలో రద్దీ పెరిగింది. ఉదయం 5గంటలకు సర్వదర్శనం కోసం 13 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా, వారికి స్వామి దర్శనం పూర్తయ్యేందుకు 6 గంటలకు పైగా సమయం పడుతోంది.
కాలి నడక భక్తులు 2 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి 3 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 60,431మంది భక్తులు దర్శించుకున్నారు. 2 కోట్ల 57 లక్షల రూపాయల హుండీ ఆదాయం వచ్చింది.
