1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. tirumala tirupathi news

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ... శ్రీవారిని దర్శించుకున్న 40 వేల మంది భక్తులు

tirumala tirupathi
సూర్యగ్రహణం ప్రభావం తిరుమలపై పడింది. ఒక్కసారిగా భక్తుల సంఖ్య తగ్గింది. సూర్యగ్రహణానికి రెండు రోజుల ముందు నుంచే టిటిడి మీడియా ద్వారా ఆలయాన్ని మూసివేస్తామని సమాచారం తెలుపుతూ వచ్చింది. దీంతో భక్తుల రద్దీ తగ్గింది. నిన్న ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ శ్రీవారిని 40,613 భక్తులు దర్శించుకున్నారు. 
 
గ్రహణం కావడంతో 6 గంటల నుంచి భక్తులను ఆలయంలోకి అనుమతించలేదు. 8 గంటల 30 నిమిషాలకు ఆలయ ద్వారాలను టిటిడి మూసివేసింది. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.3.01 కోట్లు. సూర్యగ్రహణం ప్రభావంతో తిరుమలలోని రహదారులు ఖాళీగా కనిపిస్తున్నాయి.
About Writer
ttdj