సూర్యగ్రహణం... రేపు రాత్రి నుంచి శ్రీవారి ఆలయం మూసివేత
తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం ఒక రోజంతా మూతపడనుంది. సూర్యగ్రహణం నేపథ్యంలో తితిదే ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో మంగళవారం రాత్రి 8.30 నుంచి బుధవారం ఉదయం 10 గంటల వరకు మూసివేయనున్నారు. అలాగే, గ్రహణం కారణంగా బుధవారం ఉదయం శ్రీవారికి సహస్రకలశాభిషేకాన్ని తితిదే రద్దుచేసింది.
అయితే, సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను మాత్రం ఏకాంతంగా నిర్వహించనుంది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నప్రసాద సముదాయాన్ని కూడా మూసివేస్తున్న కారణంగా అన్నప్రసాద వితరణ కూడా ఉండదు. సూర్య గ్రహణాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమల పర్యటనను రూపొందించుకోవాలని భక్తులకు ఆలయ అధికారులు సూచించారు.
