శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Updated : శనివారం, 7 జనవరి 2017 (15:33 IST)

8న వైకుంఠ ఏకాదశి... దర్శనంలో సామాన్యులకు పెద్ద పీట సాధ్యమా...!

వైకుంఠ ఏకాదశి వచ్చిందంటే చాలు.. తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరుగుతోంది. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి ఆలయంలో వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే వైకుంఠ ద్వారాన్ని తెరుస

వైకుంఠ ఏకాదశి వచ్చిందంటే చాలు.. తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరుగుతోంది. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి ఆలయంలో వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు కాబట్టి అధికసంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఎప్పటి లాగే తితిదే సామాన్య భక్తులను గాలికొదిలేసి విఐపిల సేవలో తరిస్తుంటుంది. అది షరామామూలే. కానీ ఈసారి మాత్రం తితిదే ఉన్నతాధికారుల ఇంటర్వ్యూలు చూస్తే మాత్రం ఆశ్చర్యపోకతప్పదు. 
 
విఐపిలకు కేవలం రెండుగంటలు మాత్రమే కేటాయించి మిగిలిన 42గంటలూ సామాన్యులకేనని ఛానళ్ళకు, పత్రికలకు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నారు. కానీ జరిగిదే మాత్రం అందుకు పూర్తి విరుద్థం. చలిలో భక్తుల నరకయాతన, గంటల తరబడి స్వామి దర్శనం కోసం వేచి ఉండడం, చివరకు సొమ్మసిల్లడం ఇలాంటి సామాన్యభక్తులకు అలవాటుగా మారిపోయిందన్న విమర్శలు లేకపోలేదు. అసలు తితిదే ఉన్నతాధికారులు చెప్పిన మాటలు వింటే.
 
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని భక్తకోటికి శ్రీవారి దర్సనం, వైకుంఠ ద్వార ప్రవేశం కల్పనకు సకల ఏర్పాట్లు చేశాం, సామాన్య భక్తులకు మెరుగైన సేవలు అందిస్తాం.. విఐపిలను కొద్ది సమయం మాత్రమే కేటాయిస్తున్నాం... ఇది తితిదే జెఈఓ శ్రీనివాసరాజు ఇచ్చిన ఇంటర్వ్యూ. అంతేకాదు. శనివారం రాత్రి 9.30 గంటలకే శ్రీవారి ఏకాంతతసేవ నిర్వహిస్తాం. అర్థరాత్రి 12.05 గంటలకు స్వామివారికి తిరుప్పావై పఠనంతో మేల్కొలిపి సేవ జరుగుతుంది. 
 
అనంతరం స్వామివారికి కైంకర్యాలు నిర్వహించి ఆదివారం వేకువజామున 1.30 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరిచిన వెంటనే పాసులు పొందిన ప్రోటోకాల్‌ పరిధిలోని ప్రముఖులకు బ్రేక్‌ దర్సన అవకాశం కల్పిస్తాం. వీరికి లఘుదర్సనం కల్పించి రెండుగంటలు అటు ఇటుగా సమయం పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
 
తర్వాత 4 గంటలకు దర్శదర్శనం మినహా ఎలాంటి దర్శనాలకు అనుమతించరాదని నిర్ణయించాం. రెండు పర్వదినాల్లో 42గంటల వరకు సామాన్య భక్తులకే ప్రత్యేక అవకాశం కల్పిస్తామని చెప్పారు. కాలినడకన వచ్చే యాత్రికులకు దివ్యదర్సనం టోకెన్ల జారీని శుక్రవారం అర్థరాత్రి కోసం శనివారం ఉదయం 9గంటల నుంచి వైకుంఠం-2లోని కంపార్టుమెంట్లలోకి భక్తులను అనుమతిస్తాం. వైకుంఠం-2 నుంచి జారీ చేసే పున ప్రవేశకార్డులను సోమవారం వరకు నిలిపివేయాలని నిర్ణయించామని చెప్పారు. ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించమంటూనే విఐపిలకు దర్శనం కల్పిస్తోంది తితిదే.