బుధవారం, 26 ఫిబ్రవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Updated : మంగళవారం, 14 జూన్ 2016 (20:52 IST)

తితిదే ఛైర్మన్‌, ఈఓల ఆత్మీయ కరచాలనం.. ఎందుకు?

తిరుమల తిరుపతి దేవస్థానం... ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ధార్మిక సంస్థలలో ప్రముఖమైనది. అలాంటి ధార్మిక సంస్థలో పనిచేస్తున్న ఉన్నతాధికారులకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. తితిదేకి సంబంధించిన ఏ నిర్ణయాన్నైనా ఉన్నతాధికారులు కలిసే తీసుకోవాల్సింది ఉంది. అందులో ఒకటి తితిదే పాలకమండలి ఛైర్మన్‌ పదవి కాగా, మరొకటి తితిదే కార్యనిర్వహణాధికారి పదవి. 
 
మంగళవారం తిరుమలలో జరిగిన తితిదే పాలకమండలి సమావేశంలో వీరిద్దరి మధ్య ఆశక్తికరమైన విషయం ఒకటి జరిగింది. పాలకమండలి సమావేశం ప్రారంభానికి ముందే ఇద్దరూ కలిసి ఆత్మీయ కరచాలనం చేసుకున్నారు. ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. వీరిద్దరి మధ్య జరిగిన ఆశక్తికరమైన విషయాలను పాలకమండలి సభ్యులతో పాటు మీడియా ప్రతినిధులు కూడా ఆశక్తిగా తిలకించారు. ప్రస్తుతం వీరిద్దరి ఆత్మీయ కరచాలనం ప్రస్తుతం తితిదేలో చర్చనీయాంశంగా మారింది.