Daily Horoscope
✕

టిటిడి గుడ్ న్యూస్.. బస్సులో తీసుకెళ్లి ఫ్రీ దర్శనం

Written By సెల్వి
Updated: బుధవారం, 22 సెప్టెంబరు 2021 (09:19 IST)
టిటిడి జిల్లాల్లో స్వామివారి ఆలయాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయా జిల్లాల్లోని వెనక బడిన ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు టిటిడి గుడ్ న్యూస్ చెప్పింది. వారిని బస్సులో ఉచితంగా తీసుకువచ్చి స్వామి వారి దర్శనం చేయించేందుకు నిర్ణయం తీసుకుంది. 
 
ఈ విషయాన్ని టిటిడి ఈవో జవహర్ రెడ్డి వెల్లడించారు. స్థానిక అన్నమయ్య భవనం లో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జవహర్ రెడ్డి మాట్లాడుతూ… వచ్చేనెల 7 నుండి 15 తేదీల మధ్య సాలకట్ల బ్రహ్మోత్సవాలు నితవించనున్నట్టు తెలిపారు.
 
ఈ సందర్భంగా 500 నుండి 1000 మంది భక్తులకు దర్శనం కల్పించాలని నిర్ణయించారు. దానికోసం కావాల్సిన విధి విధానాలను సిద్దం చేయాలని అధికారులకు జవహర్ రెడ్డి ఆదేశించారు. 
 
అదే విధంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా అలిపిరి మార్గాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా అక్టోబర్ కు సంబందించి రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లను రేపు ఉదయం 9గంటలకు ఆన్లైన్ లో విడుదల చేయనున్నట్టు తెలిపారు.

అన్నీ చూడండి

నవంబర్ 5, 2026 నాటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాతావరణం ఎలా వుంది?

9 ఏళ్ల బాలికకు క్లాసులోనే కార్డియక్ అరెస్ట్, కుప్పకూలి మృతి, వీడియో

మత్స్యకారులను కాపాడేందుకు వెళ్లిన 11 మంది ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది గల్లంతు

పిల్లి వల్ల ఓటమిపాలయ్యా, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు మీరు నమ్మొద్దు: వైసిపి చైర్మన్ అభ్యర్థి చింతపల్లి, వీడియో

యూట్యూబ్ సాయం : అద్దె ఇంట్లో నకిలీ కరెన్సీ తయారీ ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు

అన్నీ చూడండి

05-11-2026 గురువారం నాటి రాశి ఫలాలు - అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటే?

04-11-2026 బుధవారం నాటి రాశి ఫలాలు - ఇతరుల మాటలను మాత్రమే నమ్మి..?

పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. బుధవారం హనుమంతుడికి తమలపాకుల మాలను..?

03-11-2026 మంగళవారం ఫలితాలు - మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది...

02-11-2026 సోమవారం ఫలితాలు - పనుల్లో శ్రమ, చికాకులు అధికం...

తర్వాతి కథనం
Show comments