1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. TTD will be released Darshan tickets on Feb 20

శ్రీవారి భక్తులు త్వరపడండి, దర్సన టిక్కెట్ల కోటా విడుదల, ఎప్పుడంటే?

TTD
శ్రీవారి భక్తుల సౌకర్యార్థం మార్చి నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్సనా టిక్కెట్ల కోటాను ఫిబ్రవరి 20వ తేదీన శనివారం ఉదయం 9 గంటలకు, గదుల కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి ఆన్‌లైన్లో విడుదల చేయనుంది.
 
అదేవిధంగా మార్చి నెలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్టు టిక్కెట్ల కోటాను ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్లో ముందస్తుగా దర్సన టిక్కెట్లను గదులను బుక్ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.
 
గంటల తరబడి టోకెన్ల కోసం తిరుపతికి వచ్చి వెయిట్ చేయడం.. గదుల దొరక్క ఇబ్బంది పడకుండా సులువుగా ఆన్లైన్లో దర్సన టోకెన్లు, గదులను బుక్ చేసుకునే అవకాశాన్ని టిటిడి కల్పిస్తోంది. అయితే ఎప్పుడు టిటిడి ఆన్లైన్లో దర్సన టోకెన్లు, గదులకు సంబంధించి కోటాను రిలీజ్ చేసినా రెండుమూడు గంటల్లోనే అయిపోతోంది. దీంతో చాలామంది భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
About Writer
జె
తర్వాతి కథనం
చిలుకకు అర్థమైంది కానీ అతడికి అర్థం కాలేదు, అదే తేడా...