1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Updated : మంగళవారం, 17 మే 2016 (12:23 IST)

తిరుమలలో 7 గంటల్లో శ్రీవారి దర్శనం.. తిరుపతిలో చిరుజల్లులు

తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. ఐదురోజులుగా ఉన్న రద్దీతో పోలిస్తే ప్రస్తుతం కొద్దిగా తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవచ్చు. కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు వేచి ప్రస్తుతం వేచి ఉన్నారు. మంగళవారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి దర్శన సమయం 7 గంటల సమయం పడుతోంది. 
 
కాలినడక భక్తులు 4 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి మూడు గంటలకుపైగా సమయం పడుతోంది. గదులు కూడా ఖాళీగానే దొరుకుతున్నాయి. కళ్యాణకట్టకు భక్తులు చేరుకుని సులువుగానే తలనీలాలు సమర్పించుకుంటున్నారు. సోమవారం శ్రీవారిని 83,001 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.71 కోట్లు వసూలైంది.
 
తిరుపతిలో చిరుజల్లుల వర్షం 
తిరుపతిలో చిరుజల్లులతో కూడిన వర్షం పడుతోంది. వేసవితో ఇబ్బంది పడుతున్న పట్టణ ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించినట్టయింది. సోమవారం నిన్న సాయంత్రం నుంచి కూడా చల్లటి వాతావరణం పట్టణంలో కనిపించింది. అయితే మంగళవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి చిరుజల్లుల వర్షం నిరంతరాయంగా పడుతూనే ఉంది. వాతావరణం పూర్తిగా చల్లగా ఉండటంతో స్థానికులతో పాటు పుణ్యక్షేత్రాల సందర్శనకు వచ్చే భక్తులు వూపిరి పీల్చుకుంటున్నారు. ప్రతియేటా గంగజాతర సమయంలో వర్షం పడుతుంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వర్షం పడుతోందని పట్టణ వాసులు అనుకుంటున్నారు.