ఏయ్.. ఏంటి ఆలోచిస్తున్నావ్... నాతో పోటీకి సిద్ధమేనా?

తాబేలు: ఏయ్.. ఏంటి ఆలోచిస్తున్నావ్.. నాతో పోటీక్ సిద్ధమేనా? పెద్దకోడి: నువ్వు నెమ్మదిగా నడుస్తావు.. నీతో నాకేంటి పోటీ! తాబేలు: నేనా! నీకంటే వేగంగా వెళ్లగలను.. కావాలంటే నిరూపించమంటావా? పెద్దకోడి: ఎలా?

Kowsalya| Last Updated: సోమవారం, 27 ఆగస్టు 2018 (16:23 IST)
తాబేలు: ఏయ్.. ఏంటి ఆలోచిస్తున్నావ్.. నాతో పోటీక్ సిద్ధమేనా?
పెద్దకోడి: నువ్వు నెమ్మదిగా నడుస్తావు.. నీతో నాకేంటి పోటీ!
తాబేలు: నేనా! నీకంటే వేగంగా వెళ్లగలను.. కావాలంటే నిరూపించమంటావా?
పెద్దకోడి: ఎలా?
తాబేలు: సరే.. మనం ఒక పందెం వేసుకుందాం.. ఇక్కడి నుండి నది ఒడ్డు వరకు వెళ్లి అక్కడి నుండి తిరిగి ఇక్కడికి ఎవరు ముందుగా వస్తారో వారే గెలిచినట్లు సరేనా?
పెద్దకోడీ: రెడీ రెడీ...
తాబేలు: ఎంత తొందరగా వెళతావో వెళ్లు...
పెద్దకోడి: హమ్మయ్య నది వద్దకు చేరిపోయా..
తాబేలు: హాయ్! నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు.
పెద్దకోడి: ఇంత తొందరగా ఎలా వచ్చావు? సరే.. ఈసారి చూడు నిన్ను ఎలా ఓడిస్తానో...
తాబేలు: చూసావా! నీకంటే ముందే ఇక్కడకు చేరుకున్నాను.
పెద్దకోడి: నువ్వు నాకంటే ముందుగా ఎలా రాగలిగావు?
తాబేలు: మిత్రమా! కొందరు నీటిలో వేగంగా వెళ్లగలరు... మరికొందరు నేలపై వేగంగా పరుగెత్త గలరు.. నేను దారి పక్కనున్న నీటిలో ఈదుకుంటూ నీకంటే ముందాగా గమ్యం చేరుకున్నాను....దీనిపై మరింత చదవండి :