తైవాన్ దేశాన్ని కారులో ఎన్ని గంటల్లో చుట్టి రావచ్చో తెలుసా?

మనం కొన్ని ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి వాతావరణం, దర్శనీయ ప్రదేశాలు మొదలైనవి మనకు బాగా నచ్చితేనే ఎంజాయ్ చేయగలుగుతాం. అలా ఎంజాయ్ చేయగలిగే దర్శనీయ ప్రదేశాలల్లో తైవాన్ ఒకటి. అక్కడ చూడదగిన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం... తైవాన్ చైనా దేశానికి పశ్చ

Taiwan
chj| Last Modified శుక్రవారం, 20 ఏప్రియల్ 2018 (18:49 IST)
మనం కొన్ని ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి వాతావరణం, దర్శనీయ ప్రదేశాలు మొదలైనవి మనకు బాగా నచ్చితేనే ఎంజాయ్ చేయగలుగుతాం. అలా ఎంజాయ్ చేయగలిగే దర్శనీయ ప్రదేశాలల్లో తైవాన్ ఒకటి. అక్కడ చూడదగిన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం... తైవాన్ చైనా దేశానికి పశ్చిమంగా పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న చిన్న ద్వీపం. పచ్చని అడవులు, కొండలతో అలరారుతుంటుంది. అక్కడ వేసవి జూన్ నుండి సెప్టెంబరు వరకు ఉంటుంది. ఉష్ణోగ్రతలు ఎక్కువే. చలికాలం విపరీతమైన చలి. అందుకే ఆ దేశాన్ని చూడటానికి అక్టోబరు నుండి డిసెంబరు వరకు మంచి సీజన్ అంటారు. 
 
తైవాన్‌లో కరెన్సీ డాలరు. ప్రాచీన చైనాకు సంబంధించిన ఏడు లక్షల వస్తు సముదాయాన్ని సేకరించి ప్రదర్శిస్తున్న నేషనల్ ప్యాలెస్ మ్యూజియం అద్భుతంగా ఉంటుంది. అక్కడి వస్తువుల గురించి తెలుసుకోవడానికి ఓ ఆడియో ప్లేయర్ ఇస్తారు. ఈ మ్యూజియం చైనా వస్తువులకు సంబంధించి ప్రకపంచంలోనే అతి పెద్దదిగా పేరొందింది. అక్కడి మరో విశేషమైన స్థలం తైపే టవర్. దీని ఎత్తు సుమారు 509 మీటర్లు. ఇందులోని ఎలివేటర్ నిముషానికి 1,010 మీటర్ల ఎత్తుకి ప్రయాణిస్తుంది. ఈ టవర్ నిర్మాణానికి వాడిన అద్దాల్ని డబుల్ లేయర్డ్ గ్లాస్ అంటారు.
 
ఇవి వేడి నుండి అతినీలలోహిత కిరణాల నుండి టవర్ని రక్షిస్తాయట. దానిని తయారుచేయడానికి సుమారు 28 కోట్లు ఖర్చయిందట. సాయంత్రం ఐదు, ఆరు గంటల మధ్యలో తైపే టవర్‌కి ఎదురుగా ఉన్న ఏనుగుకొండ మీద ఈ టవర్ నీడ తిరగేసినట్లు కనిపించేలా కట్టడం మరో ప్రత్యేకత. అమెరికాలోని సిలికాన్ వ్యాలీని ఆదర్శంగా తీసుకుని నిర్మించిన ప్రాంతం డాంగ్ క్సింగ్ సించు సైన్స్ పార్క్. ఇక్కడ దాదాపు 520 పైగా కార్యాలయాలున్నాయి. అక్కడికి దగ్గర్లోనే నాన్‌లియో అనే ప్రదేశం ఉంది. ఇక్కడ ప్రదేశం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ వివిధ రకాలైన జలచరాలను చూడవచ్చు. తైవాన్‌కు ఉన్న మరో ప్రత్యేకత నైట్ బజార్లు. అక్కడ ఖరీదైన వస్తువులు చాలా చౌకగా లభిస్తాయి. తైవాన్ దేశం మొత్తాన్ని కారులో ఆరు గంటల్లో చుట్టి రావచ్చట.



దీనిపై మరింత చదవండి :