సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 24 ఫిబ్రవరి 2022 (11:57 IST)

ఉక్రెయిన్ పైన రష్యా సైనిక దాడి: భారీగా పతనమవుతన్న భారతీయ స్టాక్ మార్కెట్

ఉక్రెయిన్‌లో రష్యా ప్రత్యేక సైనిక చర్య ప్రకటించడంతో భారతదేశంలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఉక్రెయిన్‌లో రష్యా ప్రత్యేక సైనిక ఆపరేషన్ ప్రకటించిన తర్వాత పెట్టుబడిదారులు జాగ్రత్తగా మారడంతో గురువారం భారతీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి.

 
సెన్సెక్స్ 1600 పాయింట్లు పతనమవగా, నిఫ్టీ 16,600 మార్కు దిగువకు పడిపోయింది. పలు కంపెనీల షేర్లు భారీగా నష్టాలను చవిచూస్తున్నాయి.