సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 ఏప్రియల్ 2020 (14:40 IST)

ఫేస్‌బుక్‌, రిలయన్స్ డీల్.. లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు

ఫేస్‌బుక్‌, రిలయన్స్ జియో మెగాడీల్ భారత మార్కెట్లకు కలిసొచ్చింది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి మళ్లాయి. అంతేగాకుండా ఒక్కసారిగా ఇన్వెస్టర్లలో ఉత్సాహం పుంజుకుంది. దీంతో రిలయన్స్ (ఆర్‌ఐఎల్) షేర్స్ 8 శాతానికి పైగా లాభపడింది. 
 
రిలయన్స్ లాభాల మద్దతుతో సెన్సెక్స్ 680 పాయింట్లు ఎగిసి 31318 వద్ద, నిఫ్టీ 175పాయింట్లు లాభపడి 9157 వద్ద ట్రేడ్ అవుతోంది. తద్వారా సెన్సెక్స్ 31 వేల,300 స్థాయిని, నిఫ్టీ9150 స్థాయికి ఎగువన స్థిరంగా కొనసాగుతున్నాయి. ఫలితంగా మెటల్ వాటాలు పెరుగుతున్నాయి. ఆటో, ఎఫ్ఎమ్‌సీజీ, ఎనర్జీ, ఐటీ, ఇన్ఫ్రా సూచీలు కొనుగోలు బాట పడుతున్నాయి. 
 
అలాగే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 20 శాతానికి పైగా పెరిగాయి. మరోవైపు డాలరు బలంతో దేశీయ కరెన్సీ రూపాయి బుధవారం మరో రికార్డు కనిష్టానికి దిగజారింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఆల్ టైం కనిష్ట స్థాయి 76.88 పతనమైంది.