స్వస్థలమైన మనకర్‌లో రఫెల్ నాదల్ టెన్నిస్ అకాడమీ! 2016 లోపు..

Selvi| Last Updated: మంగళవారం, 25 నవంబరు 2014 (13:27 IST)
స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ టెన్నిస్ అకాడమీ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు. తన స్వస్థలమైన మనకర్‌లో అకాడమీని నెలకొల్పనున్నాడని తెలిపాడు. టెన్నిస్ అకాడమీ ప్రాజెక్టు కోసం చాలా సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నామన్నాడు.

2016లో వేసవి శిబిరంగా ప్రారంభించేందుకు ప్రణాళిక వేస్తున్నామని నాదల్ తెలిపాడు. ఇదే అకాడమీలో వర్ధమాన టెన్నిస్ ఆటగాళ్లు తమ చదువును కొనసాగించేందుకు పాఠశాల కూడా ఏర్పాటు చేస్తారట.

పద్నాలుగు సార్లు గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలుచుకున్న నాదల్, ఇటీవలే అపెండిసైటిస్ అపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. కొన్ని రోజుల్లో వెన్నుపూస నొప్పికి స్టెమ్ సెల్ చికిత్స తీసుకోనున్నాడు. తిరిగి జనవరిలో టెన్నిస్ పోటీల్లో పాల్గొంటాడని తెలిసింది.దీనిపై మరింత చదవండి :