గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 17 మార్చి 2016 (13:27 IST)

సైనా నెహ్వాల్‌‌కు బర్త్ డే గిఫ్ట్: త్వరలోనే వెండితెరపై బయోపిక్.. రికార్డ్స్ ఇవిగోండి..!

సైనా నెహ్వాల్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు: 26 ఏట వరల్డ్ బ్యాడ్మింటన్ స్టార్

ప్రపంచ బ్యాడ్మింటన్‌లో అగ్రస్థానంలో నిలిచిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు గురువారం (మార్చి 17) పుట్టిన రోజు. ఈ సందర్భంగా సైనా నెహ్వాల్‌కు సోషల్ మీడియాలో ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైనా బయోపిక్ త్వరలో తెరకెక్కనుందని సమాచారం. బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మిల్కా సింగ్, మేరీ కోమ్ జీవితాల ఆధారంగా సినిమాలు తెరపైకి వచ్చాయి. 
 
ఇంకా ఇండియన్ క్రికెట్ కెప్టెన్లు మొహమ్మద్ అజారుద్ధీన్, మహేంద్ర సింగ్ ధోనీ, కోచ్ మహావీర్ సింగ్‌ల బయోపిక్‌లు రిలీజ్ కానున్నాయి. ఈ నేపథ్యంలో సైనా నెహ్వాల్ బయోపిక్ వచ్చే ఏడాది రిలీజయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ సందర్భంగా సైనా నెహ్వాల్ మాట్లాడుతూ.. గురువారంతో (మార్చ్ 17) 26వ ఏట అడుగుపెడుతున్నానని చెప్పింది. ఈ ఏడాది మెరుగైన ఆటతీరును ప్రదర్శించేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తానని చెప్పింది.
 
ఇకపోతే.. సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ నెం.1 ర్యాంకులో కొనసాగుతోంది. తొలిసారిగా ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం సాధించింది. మార్చి 17,1990లో జన్మించిన సైనా నెహ్వాల్  21 అంతర్జాతీయ టైటిల్స్ నెగ్గింది.
 
* 2006 అండర్-19 జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది. 
* 2006 మేలో ఫిలిప్పైన్ ఓపెన్స్ టైటిల్ నెగ్గిన అతిపిన్న క్రీడాకారిణిగా గుర్తింపు సాధించింది. 
* 2010 జూన్‌లో సింగపూర్ సూపర్ సిరీస్ నెగ్గింది
* 2010 డిసెంబరులో హాంకాంగ్ సూపర్ సిరీస్ 
* 2012 జూన్‌లో ఇండోనేషియన్ ఛాంపియన్‌గా నిలిచింది. 
* 2009 అర్జున అవార్డుకు సిఫార్సయ్యింది. 
* రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు (2009-10)లో సొంతం చేసుకుంది. 
* 2010లోనే పద్మ శ్రీ అవార్డును కూడా కైవసం చేసుకుంది. 
 
* బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా గుర్తింపు సాధించేందుకు ముందు కరాటేలో బ్రౌన్ బెల్ట్ సాధించింది  
*  సైనా తండ్రి హర్వీర్ సింగ్, ఉషా నెహ్వాల్ హర్యానా బ్యాడ్మింటన్ ఛాంపియన్స్ కావడం గమనార్హం. 
*  సైనా బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ర్యాంకింగ్స్‌లో తొలి భారతీయ మహిళగా అగ్రస్థానంలో నిలిచింది.
* లండన్ ఒలింపిక్స్‌ 2014లో రజత పతకం సాధించింది. 
* ప్రస్తుతం సైనా నెహ్వాల్ మార్చి 10, 2016 నాటికి బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉంది.