రియో ఒలింపిక్స్ 2016: ఇంద్రజీత్ సింగ్ డోపింగ్ టెస్టులో పట్టుబడ్డాడా? నాలుగేళ్ల పాటు నిషేధం?
ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా క్రీడాకారులందరూ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో భారత క్రీడాకారులు సైతం సమరానికి సై అంటున్నారు. కానీ భారత అథ్లెట్లు డోపింగ్ పరీక్షల్లో విఫలమవడం క్రీడాభిమా
ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా క్రీడాకారులందరూ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో భారత క్రీడాకారులు సైతం సమరానికి సై అంటున్నారు. కానీ భారత అథ్లెట్లు డోపింగ్ పరీక్షల్లో విఫలమవడం క్రీడాభిమానులకు కలవరపాటుకు గురిచేస్తోంది. భారత స్టార్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోపింగ్‌లో దొరికిన రెండు రోజుల వ్యవధిలోనే తాజాగా మరో భారత షాట్‌పుట్ క్రీడాకారుడు ఇంద్రజీత్‌సింగ్ డోప్ పరీక్షలో ఫెయిల్ కావడంతో క్రీడాభిమానులు నిరాశ చెందుతున్నారు.
తాజాగా జూన్ 22న నిర్వహించిన డోప్ పరీక్షలో ఇంద్రజీత్ పట్టుబడినట్లు సమాచారం. అయితే డోపింగ్ పరీక్ష ఫలితంపై స్పందించిన ఇంద్రజీత్ తన పట్ల ఏదో కుట్ర జరిగిందని ఆరోపించాడు. కావాలంటే తన ‘బి’ శ్యాంపిల్‌ను పరీక్ష చేయాలని కోరాడు. కాగా, మంగళవారమే ఇంద్రజీత్ ‘బి’ శ్యాంపిల్‌ను ఢిల్లీలో పరీక్షించనున్నట్లు సమాచారం. ఇక బి శ్యాంపిల్ కూడా పాజిటీవ్‌గా తేలితే, ఇక ఇంద్రజీత్ సింగ్ ఒలింపిక్స్ ఆశలు వదులుకోవాల్సిందే. ఒకవేళ ''బి" శ్యాంపిల్‌లో కూడా పాజిటివ్ అని తేలితే వరల్డ్ ఆంటీ డోపింగ్ ఏజెన్సీ చట్టం ప్రకారం నాలుగేళ్ల పాటు నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది.