1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 అక్టోబరు 2023 (12:43 IST)

ఆసియా క్రీడలు : జావెలిన్ త్రో - నీరజ్ చోప్రాకు గోల్డ్ మెడల్

neeraj chopra
చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భాగంగా, జావెలిన్ త్రో విభాగంలో భారత క్రీడాకారుడు నీరజ్ చోప్రా బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. అలాగే, ఇదే ఈవెంట్‌‌లో కిషోర్ రుమార్ జెనా రజత పతకాన్ని సాధించాడు. ఈ పతకంతో ఇప్పటివరకు భారత్ ఖాతాలో చేరిన పతకాల సంఖ్య 81కు చేరింది. వీటిలో 18 బంగారు, 31 రజత, 32 కాంస్య పతకాలు ఉన్నాయి. 
 
బుధవారం జరిగిన పోటీల్లో పురుషులు 4x400 మీటర్ల రిలే ఈవెంట్‌లో భారత్ బంగారు పతకం సాధించింది. దీంతో ఈ సంఖ్య 18కి చేరింది. మహిళల 4x400 మీటర్ల ఈవెంట్‌లోనూ భారత్ రజతం దక్కించుకుంది. 35 కిలోమీటర్ల రేస్ వాక్‌ మిశ్రమ విభాగంలో భారత్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 
 
అంతకుముందు జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈటెను 88.88 మీటర్ల దూరం విసిరి పసిడి పతకాన్ని సాధించారు. మరో జావెలిన్ త్రోయర్ కిషోర్ కుమార్ జెనా ఈటెన 87.54 మీటర్ల దూరం విసిరి సరజ పతకం నెగ్గారు.