సోమవారం, 24 ఫిబ్రవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 29 ఆగస్టు 2016 (12:29 IST)

ఉస్సేన్ బోల్ట్ విజయ రహస్యం గొడ్డు మాంసం ఆరగించడమేనట!

రియో ఒలింపిక్స్ క్రీడల్లో మూడు స్వర్ణ పతకాలు కేవసం చేసుకున్న అథ్లెట్ ఉస్సేన్ బోల్ట్. పైగా.. గత మూడు ఒలింపిక్స్ పోటీల్లో మూడేసి చొప్పున స్వర్ణాలు గెలుచుకున్న చిరుత పులిగా ఆయన రికార్డు సృష్టించాడు. అయిత

రియో ఒలింపిక్స్ క్రీడల్లో మూడు స్వర్ణ పతకాలు కేవసం చేసుకున్న అథ్లెట్ ఉస్సేన్ బోల్ట్. పైగా.. గత మూడు ఒలింపిక్స్ పోటీల్లో మూడేసి చొప్పున స్వర్ణాలు గెలుచుకున్న చిరుత పులిగా ఆయన రికార్డు సృష్టించాడు. అయితే, ఇపుడు ఉస్సేన్ బోల్ట్ విజయ రహస్యంపై చర్చ సాగుతోంది. 
 
ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ ఉదిత్ రాజ్ స్పందిస్తూ.. ఉస్సేన్ బోల్ట్ చిన్నప్పటి నుంచి పేదరికం కారణంగా గొడ్డుమాంసం తినడానికి అలవాటు పడ్డాడని, ఆ అలవాటే అతను 9 ఒలింపిక్ స్వర్ణ పతకాలు సాధించేందుకు కారణమని వ్యాఖ్యానించారు. 
 
ఈ జమైకా లెజండ్ విజయాల వెనకున్న సీక్రెట్ ఇదేనని, అతని శిక్షకుడు సైతం రెండుపూటలా బీఫ్ తినమని సలహాలు ఇచ్చేవాడని చెప్పారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో తొలి పతకం నెగ్గిన బోల్ట్, తాజా రియో ఒలింపిక్స్‌లో 9వ స్వర్ణాన్ని గెలిచి, తన కెరీర్‌ను విజయవంతంగా ముగించిన సంగతి తెలిసిందే.