సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By మోహన్
Last Updated : సోమవారం, 25 మార్చి 2019 (19:30 IST)

ఆటలో చేతికి దొరికిందని చడ్డీని కిందికి లాగేశాడు..

మీరు ఎప్పుడైనా టీవీలో డబ్ల్యూడబ్ల్యూఈ పోటీలను వీక్షించారా? అందులో ఫైటర్‌లు బలంగా పోటీ పడుతుంటారు. కొన్నిసార్లు ఒకరిపై మరొకరు చేతికి అందిన వస్తువులతో దాడి చేస్తారు. ఇలాంటి సన్నివేశాలు అనేక సార్లు మనం చూస్తూనే ఉంటాం. కానీ మరొక అరుదైన దృశ్యం ఒకటి ఈ వారం పోలెండ్ దేశంలో జరిగిన ఎమ్ఎమ్ఏ ఫైట్‌లో చోటుచేసుకుంది. పోలెండ్‌లో కేఎస్‌డబ్ల్యూ 47 - ది ఎక్స్ వారియర్స్ అనే ఈవెంట్ జరిగింది.
 
ఈ ఈవెంట్‌లో ఫిలిప్ డి ఫ్రైస్, టోమాస్జ్ నర్కున్ మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. అయితే ఒక దశలో నర్కున్ మ్యాట్‌పై పడుకుండిపోయాడు. అతడు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాడు. చేతికి ఏమి దొరికినా లాగేసేలా ఉన్నాడు. చివరకు పత్యర్థి ధరించిన చడ్డీని వెనుక భాగంలో పట్టి కిందికి లాగేసాడు. 
 
అంతే ఒక్కసారిగా అక్కడ ప్రేక్షకులు అవాక్కయ్యాలా అతడు డి ఫ్రైస్ షార్ట్‌ను పట్టుకుని మెల్లగా కిందికి లాగేసాడు. ఆ ఎపిసోడ్‌ని చూసిన వారందరూ నవ్వులలో మునిగితేలారు. కొన్నిసార్లు పందెం గెలిచినప్పటికీ కామెడీ హీరో అవుతుంటారంటూ నెటిజన్లు కామెంట్‌లు చేస్తున్నారు.