సానియా మీర్జాకు కొత్త జోడీ- కొత్త పార్ట్‌నర్ ష్వెదోవాతో ధీటుగా రాణిస్తాం..
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మాడ్రిడ్ ఓపెన్‌లో రాణించేందుకు రెడీ అయ్యింది. డబుల్స్ విభాగంలో మరోసారి సత్తా చాటేందుకు సన్నద్ధమవుతోంది. తాజాగా కజకిస్థాన్‌కు చెందిన యరోస్లవా ష్వెదోవాతో జోడీ కట్టినట్
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మాడ్రిడ్ ఓపెన్‌లో రాణించేందుకు రెడీ అయ్యింది. డబుల్స్ విభాగంలో మరోసారి సత్తా చాటేందుకు సన్నద్ధమవుతోంది. తాజాగా కజకిస్థాన్‌కు చెందిన యరోస్లవా ష్వెదోవాతో జోడీ కట్టినట్లు సానియా తెలిపింది. స్విట్జర్లాండ్ స్టార్ మార్టినా హింగిస్‌తో విడిపోయిన తర్వాత చెక్ రిపబ్లిక్ ప్లేయర్ బార్బరా స్ట్రికోవాను సానియా తన డబుల్స్ పార్ట్‌నర్‌గా ఎంచుకుంది.
అయితే ఈ సీజన్లో వీరిద్దరూ పెద్దగా రాణించలేకపోవడంతో కొన్ని వారాల క్రితమే విడిపోయారు. సింగిల్స్‌లో బాగా రాణిస్తున్న బార్బరాకు డబుల్స్ ఆడడం కష్టమై పోయిందని మీర్జా చెప్పింది. ఇద్దరం అవగాహనతోనే బ్రేక్ చేసుకున్నామని తెలిపింది. కొత్త పార్ట్‌నర్ ష్వెదోవా ఆటపై మీర్జా ఆశాభావం వ్యక్తం చేశారు. సానియా- బార్బరా జంట పది టోర్నీలు మాత్రమే ఆడింది.
ష్వెదోవా కోర్టు బ్యాక్ హ్యాండ్ సైడ్ ప్లేయర్. కొత్త భాగస్వామితో మరిన్ని విజయాలు సాధిస్తానని సానియా ఆశాభావం వ్యక్తం చేసింది. వింబుల్డన్ వరకు ఇద్దరం కలసి ఆడతామని.. బహుశా సీజన్ మొత్తం కూడా ఆడే అవకాశాలున్నాయని చెప్పింది.