బుధవారం, 4 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2016 (09:27 IST)

'రియో ఒలింపిక్స్‌లో భారత్‌దే అత్యంత చెత్త ప్రదర్శన' : కివీస్ పత్రిక

రియో ఒలింపిక్స్ పోటీల్లో భారత్ క్రీడాకారుల ప్రదర్శన అత్యంత చెత్తగా ఉంది. దీనిపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు కేవలం రెండు పతకాలు మాత్రమే వచ్చాయి. అవీకూడా మహిళలు సాధిం

రియో ఒలింపిక్స్ పోటీల్లో భారత్ క్రీడాకారుల ప్రదర్శన అత్యంత చెత్తగా ఉంది. దీనిపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు కేవలం రెండు పతకాలు మాత్రమే వచ్చాయి. అవీకూడా మహిళలు సాధించిపెట్టాయి. 
 
మరీ ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్ళ ప్రదర్శన గురించి బయటి ప్రపంచం ఏమనుకుంటుందో పరిశీలిస్తే... 'రియో ఒలింపిక్స్‌లో భారత్‌దే అత్యంత చెత్త ప్రదర్శన' అని ఓ న్యూజిల్యాండ్‌ దినపత్రిక నోరు పారేసుకుంటే.. ప్రముఖ బ్రిటిష్‌ జర్నలిస్టు పీయర్స్‌ మోర్గాన్‌ మరింత చెత్త వ్యాఖ్యలు చేసి.. ట్విట్టర్‌లో దుమారం రేపాడు.
 
'120 కోట్ల జనాభా కలిగిన దేశం కేవలం రెండంటే రెండు పతకాలు తెచ్చుకున్నందుకు సంబురాలు జరుపుకొంటోంది. ఎంత చికాకు కలిగించే విషయమిది' అంటూ మోర్గాన్‌ చేసిన ట్వీట్‌పై భారతీయ నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. 
 
ఇతర దేశాలపై నోరు పారేసుకునేముందు నీ సొంత పనేంటో చూసుకోమని ఘాటుగా బదులిచ్చారు. ఎవరైనా, ఏదైనా గెలిచినప్పుడు సంబురాలు చేసుకోవడం మీ సంస్కృతిలో చికాకు కలిగించే విషయం కావొచ్చుకానీ, మా దేశ సంస్కృతిలో కాదంటూ గట్టిగా మందలించారు.
 
'ఒలింపిక్స్‌ ఇండియా వరెస్ట్‌ కంట్రీ' అనే శీర్షికతో న్యూజిలాండ్‌ హెరాల్డ్‌ పత్రిక ఓ కథనాన్ని వండివార్చింది. భారత్‌ రెండు మెడల్స్‌ సాధించి పతకాల పట్టికలో 67వ స్థానంలో నిలిచిందని, జనాభా, జీడీపీ ప్రకారం చూసుకుంటే.. ఒలింపిక్స్‌లో పాల్గొన్న అన్ని దేశాల కంటే ఇదే చెత్త ప్రదర్శన అని పేర్కొంది.