గురువారం, 10 జులై 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 21 మే 2016 (17:49 IST)

మేరీ కోమ్ ఓటమి.. రియో ఒలింపిక్స్ ఆశలు గల్లంతు

భారత ప్రముఖ మహిళా బాక్సర్ మేరీకోమ్ ఆశలు గల్లంతయ్యాయి. అస్టానా వేదికగా ఆదివారం జరిగిన రియో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ పోటీల్లో ఆమె ఓడిపోయారు. ఫలితంగా రియో ఒలింపిక్స్‌-2016కు అర్హత పొందలేక పోయింది. 51 కేజీల విభాగంలో తలపడుతున్న మేరీకోమ్ మొదటి రౌండ్‌లో జూలియానాను 3-0 పాయింట్ల తేడాతో ఓడించింది. 
 
అనంతరం జరిగిన రెండో రౌండ్‌లో జర్మనీకి చెందిన అజిజ్ నిమనీ చేతిలో ఓడిపోయింది. ఇకపై భారత్ ఆశలు 60, 75 కేజీల విభాగంలో పోటీపడుతున్న సరితా దేవి, పూజా రాణీలపైనే ఉన్నాయి. 2012 ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన మేరీ తాజా ఒలింపిక్స్‌‌కు అర్హత పోటీలోనే ఓడిపోవటం భారత బాక్సింగ్‌కు పెద్ద దెబ్బేనని భావించవచ్చు.