మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 29 జూన్ 2017 (09:43 IST)

గర్భందాల్చడం నమ్మలేకపోతున్నా.. ఆరుసార్లు పరీక్షలు చేయించా : సెరెనా

తాను గర్భందాల్చిన సంగతిని ఇప్పటికీ నమ్మలేక పోతున్నాని, అందుకే ఆరుసార్లు పరీక్షలు చేయించినట్టు ప్రముఖ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ అన్నారు. రిడ్డిట్ వ్యవస్థాపకుడు అలెక్సిస్ ఒహానియన్‌తో సహజీవనం చేస్

తాను గర్భందాల్చిన సంగతిని ఇప్పటికీ నమ్మలేక పోతున్నాని, అందుకే ఆరుసార్లు పరీక్షలు చేయించినట్టు ప్రముఖ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ అన్నారు. రిడ్డిట్ వ్యవస్థాపకుడు అలెక్సిస్ ఒహానియన్‌తో సహజీవనం చేస్తున్న సెరెనా ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్‌కు వారం రోజుల ముందు పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చిందని తెలిపింది. దీంతో షాక్‌కు గురయ్యానని చెప్పింది. దీంతో ఇంటికి వెళ్లి మరో ఐదు సార్లు పరీక్ష చేసుకుని ఫలితాలను ఒహానియన్ ముందుంచానని చెప్పింది.
 
దీంతో గర్భందాల్చానని గుర్తించిన ఒహానియన్ కూడా షాక్‌కు గురయ్యాడని తెలిపింది. ఆ తర్వాత తాను 23వ గ్రాండ్ స్లామ్‌ను సాధించానని చెప్పింది. ఏడు నెలల గర్భవతినైనా తల్లిగా తనకు ఏమి అవసరమో తెలియడం లేదన్నారు. ఇంకా చిన్నారి కోసం సిద్ధం కాలేదని తెలిపింది. తాజాగా వ్యానిటీ మ్యాగజైన్‌ ఆగస్టు సంచికకు సెరెనా నగ్నంగా ఫోజులిచ్చింది. ఈ సందర్భంగా ఆమె పై విషయాలు చెప్పుకొచ్చింది.