శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 27 జనవరి 2017 (14:45 IST)

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌... మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో సానియా.. ఏడో గ్రాండ్‌స్లామ్‌కు ఒక్కడుగు దూరంలో?

భారత టెన్నిస్ స్టార్, హైదరాబాదీ టెన్నిస్‌ సంచలనం సానియామీర్జా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్‌లోకి ప్రవేశించింది. మహిళల మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీ ఫైనల్లో స్టోసర్‌-గ్రోత్‌ జీడోపై సానియా-ఇవాన్‌ డోడిగ్ జోడీ 6-

భారత టెన్నిస్ స్టార్, హైదరాబాదీ టెన్నిస్‌ సంచలనం సానియామీర్జా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్‌లోకి ప్రవేశించింది. మహిళల మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీ ఫైనల్లో స్టోసర్‌-గ్రోత్‌ జీడోపై సానియా-ఇవాన్‌ డోడిగ్ జోడీ 6-4, 2-6, 10-5 తేడాతో విజయం సాధించింది. ఇండో- క్రోటియన్ జంటగా బరిలోకి దిగిన సానియా-ఇవాన్ సెమీఫైనల్స్‌లో ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు. ఈ క్రమంలో గంటా 18 నిమిషాల్లోనే మ్యాచ్‌ను పూర్తి చేశారు. ఫలితంగా ఏడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌కు సానియా మీర్జా జోడీ ఒకడుగు దూరంలో నిలిచింది. 
 
ఇకపోతే.. సెమీఫైనల్లో ఎలీనా స్విటోలీనా- క్రిస్ గుసిసోన్, అబిగైల్ స్పియర్స్-జువాన్ సెబాస్టియన్ జోడీల్లో ఏ జంట విజయం సాధిస్తుందో ఆ జంటతో సానియా-డోడిగ్ జంట ఫైనల్లో తలపడుతుంది. కాగా సానియా మీర్జా ఇప్పటికే రోహన్ బోపన్న, లియాండర్ పేస్, పురవ్ రాజా, దివిజ్ శరణ్, జూనియర్స్ జీల్ దేశాయ్, సిద్ధాంత్ భాంతియాలతో మిక్స్‌‍డ్ డబుల్స్ మ్యాచ్‌లో రాణించింది. ఈ ఆరుగురితో తలపడిన సానియా గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గింది. ఏడోసారిగా డోడిగ్‌తో  జతకట్టిన సానియా ఫైనల్లో మెరుగైన ఆటతీరుతో రాణించి ఈ ఏడాది ఆరంభంలోనే గ్రాండ్ స్లామ్ విన్నర్‌గా నిలవాలని భావిస్తోంది.