బుధవారం, 22 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 నవంబరు 2022 (10:53 IST)

సానియా పుట్టినరోజు-విడాకుల వార్తలు.. స్వీట్ విషెస్ చెప్పిన షోయబ్!

Sania
Sania
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు నేడు పుట్టిన రోజు. నేటితో 36 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈమెకు సోషల్ మీడియా వేదికగా ప్రముఖులు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 
 
అయితే విడాకుల వదంతుల మధ్య తన భార్య సానియా మీర్జాకు పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ స్వీట్ విషెస్ తెలిపారు. సానియా మీర్జా-షోయబ్ మాలిక్ ఏప్రిల్ 2010లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు 2018 ఇజాన్ మీర్జా మాలిక్‌ జన్మించాడు. 
 
కాగా తాజాగా విడిపోయినట్లు వస్తోన్న పుకార్ల మధ్య, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తన భార్య-భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు స్వీట్ బర్త్ డే విష్ చెప్పాడు. "మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు @mirzasaniar. మీరు చాలా ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితాన్ని కోరుకుంటున్నాను. ఈ రోజును పూర్తిగా ఆస్వాదించండి…" అంటూ పోస్టు చేశారు. కానీ ఈ విషెస్‌పై సానియా మీర్జా స్పందించలేదు.  
 
మరోవైపు సానియా మీర్జా, షోయబ్ మాలిక్ కలిసి ‘ది మీర్జా మాలిక్ షో’ని ప్రకటించారు. ఆదివారం, నవంబర్ 13, OTT ప్లాట్‌ఫారమ్ ఉర్దూఫ్లిక్స్, సానియా, షోయబ్ మాలిక్ రియాలిటీ షో 'ది మీర్జా మాలిక్ షో'లో కలిసి కనిపిస్తారని ప్రకటించింది.
 
ఈ షోకు సంబంధించిన పోస్టర్‌లో సానియా, షోయబ్‌లు తన భుజంపై చేయి వేసుకుని ఆకుపచ్చ గోడకు ఎదురుగా నిల్చున్నట్లుగా చూపించారు. ఒక విండో నేపథ్యంలో బుర్జ్ ఖలీఫాను చూపింది. ఈ జంట ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు.  
 
మరోవైపు... సానియా మీర్జా-షోయబ్ మాలిక్ విడిపోవడానికి అసలు కారణం మోడల్ అయేషా ఒమర్ అని కూడా కొన్ని వార్తా నివేదికలు పేర్కొంటున్నాయి. ఆయేషా ఒమర్ అనే ప్రముఖ పాకిస్థానీ నటి, మోడల్‌. ఈమెతో పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ సన్నిహితంగా వున్నాడని తెలుస్తోంది. 
 
కానీ ఈ వార్తలపై సానియా-షోయబ్‌లే కాదు.. అయేషా కూడా స్పందించలేదు.. ఖండించనూ లేదు. మరి సానియా-షోయబ్ జంట భవిష్యత్తు ఏమిటో కాలమే చెబుతుంది. ఆ విషయాలను పక్కనబెట్టి.. సానియా మీర్జాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుదాం.. హ్యాపీ బర్త్ డే సానియా మీర్జా..!