బుధవారం, 4 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2016 (09:13 IST)

సింధుకు రూ.6 లక్షల వజ్రాభరణం : ఎన్ఏసీ జ్యూవెలర్స్ ఎండీ

రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన పీవీ సింధుకు నగదుతో పాటు.. వివిధ రకలా ప్రోత్సాహక బహుమతులు కూడా వస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలను ప్రోత్సాహక నగదు బహ

రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన పీవీ సింధుకు నగదుతో పాటు.. వివిధ రకలా ప్రోత్సాహక బహుమతులు కూడా వస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలను ప్రోత్సాహక నగదు బహుమతిని అందజేశాయి. 
తాజాగా రూ.6 లక్షల విలువైన వజ్రాభరణం బహూకరించనున్నట్లు ఎన్‌ఏసీ జ్యూవెలర్స్‌ ఎండీ అనంతపద్మనాభన్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో జరిగే ఓ కార్యక్రమంలో సిల్వర్ స్టార్‌కు సిగ్నేచర్‌ నెక్‌పీస్‌ను బహూకరిస్తామని అందులో పేర్కొన్నారు. 
 
అలాగే, రియో ఒలింపిక్స్‌లోనే ఉమెన్‌ ఫ్రీస్టయిల్‌(58 కేజీల) విభాగం కాంస్య పతక విజేత సాక్షి మాలిక్, జిమ్నాస్టిక్స్‌లో విశేష ప్రతిభ కనబరిచిన దీపా కర్మాకర్‌కు రూ.3లక్షల విలువైన డైమండ్‌ నెక్లెస్‌లను అందిస్తామని తెలిపారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు వీలుగా ఈ బహుమతులను అందచేస్తున్నట్టు వివరించారు.