1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. శ్రీకృష్ణాష్టమి
  4. Krishna Janmashtami 2016

కృష్ణుడి తలపైకి నెమలి పింఛం ఎలా వచ్చింది...?

చూడగానే ముద్దులొలికే మోముతో ప్రేమసాగరంలో ముంచే రూపంతో ఉండే శ్రీకృష్ణుడు మథురా నగరిలో దేవకీ, వసుదేవులకు జన్మించాడు. అయితే మామ కంసుడు చంపేస్తాడని భయపడిన తల్లిదండ్రులు బాలకృష్ణుని అక్కడి నుంచి రేపల్లెకు తీసుకువెళ్లి నంద, యశోదలకు అప్పగించారు. ఎంతైనా రాజక

Krishna Janmashtami 2016
చూడగానే ముద్దులొలికే మోముతో ప్రేమసాగరంలో ముంచే రూపంతో ఉండే శ్రీకృష్ణుడు మథురా నగరిలో దేవకీ, వసుదేవులకు జన్మించాడు. అయితే మామ కంసుడు చంపేస్తాడని భయపడిన తల్లిదండ్రులు బాలకృష్ణుని అక్కడి నుంచి రేపల్లెకు తీసుకువెళ్లి నంద, యశోదలకు అప్పగించారు. ఎంతైనా రాజకుమారుడు కదా! ముఖంలోని గంభీరం, వెలుగు, రాజఠీవి ఎంత దాచినా దాగవుగా. అందమైన ఆ మోము చూసి ఆకర్షితులుకాని వారు ఉండరు. 
 
బాల్యంలో శ్రీకృష్ణుడి లీలలు అంతా ఇంతా కాదు. తనను సంహరించేందుకు వచ్చిన అనేకమంది రాక్షసులను వెన్నదొంగ అవలీలగా అంతమొందించాడు. తన మిత్రులతో ఆడుకునే సమయంలో ఎదురైన అనేక అపాయాలను సులభంగా తప్పించాడు. దీనితో సంతోషించిన మిత్ర బృందం కృష్ణుని తమ బృందానికి నాయకుడిగా చేశారు. తమ ప్రియమైన మిత్రునికి ఏదైనా చేయాలని వారు భావించారు. 
 
వెంటనే అక్కడ తిరుగుతున్న నెమలిని పట్టుకున్నారు మిత్రులు. వారు ఎందుకు పట్టుకున్నారో అర్థం చేసుకున్న ఆ నెమలి వారికి సహకరించింది. ఓ పింఛాన్ని తీసుకుని కృష్ణుని కిరీటంలో అలంకరించారు మిత్రులు. ఏదో చిన్నప్పుడు స్నేహితులు తలపై పెట్టిన పింఛం అప్పట్నుంచీ కృష్ణునికి ఓ ఆభరణంగా మారిపోయింది.
About Writer
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి
తర్వాతి కథనం
ఇంటి ఆవరణలో బావి ఎక్కడ తవ్వాలి... ఎక్కడ తవ్వకూడదు...?