మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : మంగళవారం, 11 డిశెంబరు 2018 (12:34 IST)

పరకాలలో ఓడిన కొండా సురేఖ.. వెనుకంజలో రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కారు స్పీడుకు మిగిలిన పార్టీలు గల్లంతయ్యాయి. గులాబీ దెబ్బకు అనేక మంది ఉద్ధండులు పరాజయంయ పాలయ్యారు. ఇలాంటి వారిలో పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ ఓటమి పాలయ్యారు. తెరాస అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014లో పరకాలలో తెదేపా నుంచి గెలిచిన చల్లా ధర్మారెడ్డి ఈ సారి తెరాస నుంచి పోటీచేశారు. కాగా, గత ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచి కొండా సురేఖ పోటీ చేసి విజయం సాధించారు. 
 
ఇకపోతే, కాంగ్రెస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కొడంగల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి ఇంకా వెనుకంజలోనే కొనసాగుతున్నారు. రేవంత్‌పై తెరాస అభ్యర్థి పట్నం నరేందర్‌ రెడ్డి స్వల్పంగా 626 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఫలితాలు ప్రారంభంలో కొద్దిసేపు ఆయన ఆధిక్యంలో కొనసాగినప్పటికీ తర్వాత కాస్త వెనుకబడ్డారు.