సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 నవంబరు 2023 (09:52 IST)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. 521 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు

telangana assembly poll
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 2,290 మంది అభ్యర్థులు ఉండగా, 521 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఎక్కువ మంది రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్‌కు చెందినవారు ఉన్నారు. 85 మంది కాంగ్రెస్ అభ్యర్థులు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. 
 
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 2,290 మంది అభ్యర్థుల స్వీయ అఫిడవిట్లను విశ్లేషించి అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), తెలంగాణ ఎలక్షన్ వాచ్ ఈ నివేదికను విడుదల చేశాయి. మొత్తం 2,290 మంది అభ్యర్థుల్లో 355 మంది జాతీయ పార్టీలు, 175 మంది రాష్ట్ర పార్టీలు, 771 మంది నమోదుకాని పార్టీలు, 989 మంది స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు.
 
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 2290 మంది అభ్యర్థుల్లో 521 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రకటించారు. వీరిలో 353 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని నివేదిక పేర్కొంది.
 
అయితే, 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 1,777 మంది అభ్యర్థుల్లో 368 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. 231 మంది అభ్యర్థులపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.