గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 డిశెంబరు 2023 (22:51 IST)

తెలంగాణ ఎన్నికల ఫలితాలు-రాహుల్ గాంధీ జూమ్ మీటింగ్

Rahul Gandhi
తెలంగాణ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడబోతున్నాయి. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అలెర్ట్ అయ్యింది. 
 
ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో అగ్రనేత రాహుల్ గాంధీ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు, పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కూడా రాహుల్ చర్చించారు. 
 
అలాగే ఆదివారం ఉదయం కాంగ్రెస్ సీనియర్లు చిదంబరం, సుశీల్ కుమార్ షిండే, సూర్జేవాలా హైదరాబాద్‌కు రానున్నారు. అంతేకాదు ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులంతా ఆదివారం  సాయంత్రానికి హైదరాబాద్‌కు రావాలని ఆదేశాలు జారీ అయ్యాయి.