బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 3 డిశెంబరు 2023 (14:49 IST)

డిసెంబరు 9న రేవంత్‌రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం: బండ్ల గణేష్

bandla ganesh
ప్రముఖ సినీ నటుడు, కాంగ్రెస్ పార్టీ నేత బండ్ల గణేష్ మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. రాష్ట్రంలో ఇవాళ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుండగా.. కాంగ్రెస్ విజయం కోసం బండ్ల గణేష్ ప్రత్యేక పూజలు చేశారు. బండ్ల గణేష్ ఆలయంలో విజయం కోసం ప్రార్థిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెలంగాణలో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తూ ఆ పార్టీలో కొనసాగుతున్నారు.
 
తాజాగా బండ్లగేణేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవడం ఖాయం. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎగ్జిట్ పోల్ రాకముందే కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని బండ్ల గణేష్ చెప్పారని గుర్తు చేశారు. 
 
కాంగ్రెస్ పార్టీకి 76 నుంచి 86 సీట్లు వస్తాయని బండ్ల గణేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సీఎం ఎవరన్న ప్రశ్నపై బండ్ల గణేష్ కూడా మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఎన్నికల్లో పోరాడారన్నారు. ఆయనే తెలంగాణ సీఎం అని బండ్ల గణేశ్ అన్నారు. డిసెంబరు 9న ఎల్‌బీనగర్‌ స్టేడియంలో రేవంత్‌రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని బండ్ల గణేశ్ తెలిపారు.