హాస్యనటుడు ప్రియదర్శి బైక్ చోరీ... ఏమన్నాడో చూడండి

actor priyadarsi
ఎం| Last Updated: మంగళవారం, 9 జులై 2019 (08:49 IST)
హాస్యనటుడు ప్రియదర్శి బైక్ చోరీ అయింది. అయినా దానిని అంతగా పట్టించుకోని ఈ హీరో ఎలా స్పందించాడో చూడండి.

కమెడియన్‌గా రాణించి, మల్లేశం సినిమా ద్వారా హీరోగా పరిచయమైన ప్రియదర్శి ఇటీవల చాలా ఇష్టపడి ఓ బుల్లెట్‌ కొనుక్కున్నాడు. రాత్రి దానిని ఇంటి ముందు పార్క్ చేశాడు. అయితే కొద్ది సేపటికే అది చోరీకి గురైంది. దీంతో తన బైక్ చోరీ అయిందంటూ ప్రియదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ విషయాన్ని కాస్త కామెడీని మిక్స్ చేసి ట్విట్టర్‌లో ప్రియదర్శి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ‘‘నా బైక్‌ని దొంగిలిస్తున్న వీడియో ఫుటేజ్ ఇది! కనీసం ఈ దొంగ అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయో, లేవో కూడా చెక్ చేసుకోలేదు. ఎంత ‘అన్ ప్రొఫెషనల్ థీఫ్’’ అంటూ ట్వీట్ చేశాడు.దీనిపై మరింత చదవండి :