ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 22 డిశెంబరు 2024 (16:23 IST)

ACP: హీరోయిజం ఇంట్లో.. బయటకాదు.. ఓవర్ చేస్తే తోక కట్ చేస్తాం: ఏసీపీ (Video)

ACP Vishnu Murthy
ACP Vishnu Murthy
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తించాడని ఏసీపీ విష్ణుమూర్తి ఆరోపించారు. ఇష్టమొచ్చినట్లు ప్రెస్ మీట్లు పెట్టి పోలీసులపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. పోలీసులు ఎవరూ ఫ్యాన్స్‌కు చేతులు ఊపుతూ అభివాదం చేయమని చెప్పలేదన్నారు. 
 
అల్లు అర్జున్ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాడు. ఇద్దరు మనుషులు అక్కడ శవాల లాగా పడి ఉంటే పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఈ సంఘటన తర్వాత అల్లు అర్జున్ చాలా సక్సెస్ మీట్‌లో పాల్గొన్నారు. అల్లు అర్జున్ కు కొంచెమైన సామాజిక బాధ్యత ఉందా? అంటూ ప్రశ్నించారు. 
 
చట్టానికి విరుద్దంగా ప్రెస్ మీట్లు పెట్టినందుకు కోర్టులో అల్లు అర్జున్‌కు బెయిల్ రాకుండా చేయాలని తెలిపారు. బాధ్యత రహితంగా వ్యవహరించిన అల్లు అర్జున్ పోలీసులనే అవమాపరిచేలా మాట్లాడుతున్నాడంటూ ఏసీపీ విష్ణుమూర్తి ఫైర్ అయ్యారు. ఓ ముద్దాయి అయిన నటుడు ప్రెస్ మీట్ పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. అతను బాధ్యతగల పౌరుడు కాదని, చెప్పిన వినలేదని మండిపడ్డారు. ఈ మేరకు ఏసీపీ మాట్లాడుతూ.. డబ్బు మదంతో బడా బాబులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పోలీసులు తనను సంప్రదించలేదు. చేతులు ఊపమని చెప్పారని అల్లు అర్జున్ చేసిన కామెంట్లపై ఏసీపీ ఫైర్ అయ్యారు. 
 
కానీ వీడియోలో పక్కా ఆధారాలున్నాయని చెప్పారు. ఇక అతనికి సక్సెస్ మీట్ చేసుకోలేదనే బాధ తప్ప.. పశ్చాత్తాపం కనిపించట్లేదన్నారు. ఇక పోలీసు ఆఫీసర్లనే బట్టలిప్పి చూపించే సినిమాలు తీస్తారా అంటూ మండిపడ్డారు. హీరోయిజం మీ ఇంట్లోనే చూపించుకో. బయటకు వచ్చి ఓవర్ చేస్తే తోక కట్ చేస్తామన్నారు. ప్రైవేట్ సైన్యం చూసుకుని ఓవర్ చేస్తే అందరినీ లోపలేస్తామని హెచ్చరించారు