సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 జనవరి 2024 (09:40 IST)

బండి సంజయ్‌కు కీలక పదవి.. బీజేపీ కిసాన్ మోర్చా ఇన్‌చార్జ్‌గా నియామకం

bandi sanjay - amit shah
తెలంగాణ రాష్ట్రానికి చెందిన కీలక నేత, ఆ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలను అప్పగించింది. రెండు మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బండి సంజయ్‌ను బీజేపీ కిసాన్ మోర్చా ఇన్‌చార్జ్‌గా నియమించడం గమనార్హం. అలాగే, మరికొందరు సీనియర్ నేతలకు కూడా కీలక బాధ్యతలను అప్పగించింది. 
 
యువమోర్చా ఇన్‌చార్జిగా సునీల్ బన్సల్, కిసాన్ మోర్జా ఇన్‌చార్జిగా బండి సంజయ్ కుమార్‌లను పార్టీ అధిష్టానం నియమించింది. ఇక ఎస్సీ మోర్చా ఇన్‌చార్జిగా డాక్టర్ రాధా మోహన్ దాస్ అగర్వాల్, బీజేపీ మోర్చా ఇన్‌చార్జిగా వినోద్ తావ్డే, మైనారిటీ మోర్చా ఇన్‌చార్జిగా దష్యంత్ కుమార్ గౌతమ్‌లను నియమిస్తూ ఆదేశాలు జారీచేసింది. 
 
కాగా, జూలై 2023లో చివరిసారి బీజేపీ జాతీయ అఫీస్ బేరర్ల పునర్‌వ్యవస్థీకరణ జరిగింది. గత యేడాది డిసెంబరు నెలలో బీజేపీ పంజాబ్ రాష్ట్ర పార్టీ విభాగాల ఇన్‌చార్జులను మార్చింది. వివిధ విభాగాలకు 70 మందితో ఇన్‌చార్జులను, సహా ఇన్‌చార్జులను నియమించిన విషయం తెల్సిందే. ఈ యేడాది సార్వత్రిక ఎన్నికలు జరగాల్సివుండటంతో పార్టీలో అంతర్గత మార్పులు చేర్పులు చేసింది.