బుధవారం, 11 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 4 ఆగస్టు 2024 (19:39 IST)

స్ట్రిక్ట్ ఆఫీసర్ రికార్డులను ఎలా చెక్ చేస్తున్నారో చూడండి.. (వీడియో)

Monkey
Monkey
సోషల్ మీడియాలో ఎన్నెన్నో వీడియోలు వైరల్ అవుతూ వుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడం సర్వసాధారణం. తాజాగా తెలంగాణ ఏసీబీ చీఫ్ సీవీ ఆనంద్ సోషల్ మీడియాలో పంచుకున్న ఓ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది. 
 
ఓ కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తుండగా, ఒక కోతి కూడా టేబుల్‌పై కూర్చుని ఫైళ్లు తిరగేస్తూ ఉండడం ఆ వీడియోలో చూడొచ్చు. ఆ వానరానికి అరటిపండు ఇచ్చినా పట్టించుకోకుండా ఫైర్లు పరిశీలిస్తూ.. బిజీబిజీగా కనిపించింది. 
 
ఈ వీడియోపై సీవీ ఆనంద్ సరదాగా వ్యాఖ్యానించారు. "అవినీతి అధికారులకు వల విసరడం, వారిని అరెస్ట్ చేయడం నుంచి కాస్త రెస్ట్. ప్రలోభాలకు ఏమాత్రం లొంగని స్ట్రిక్ట్ ఆఫీసర్ రికార్డులను ఎలా తనిఖీ చేస్తున్నారో చూడండి" అంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.