శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 ఆగస్టు 2024 (15:39 IST)

తల్లికి చీమలు పట్టినా పట్టించుకోని కొడుకులు (Video)

old woman
తెలంగాణ రాష్ట్రంలోని నెక్కొండలో ఓ దారుణం వెలుగు చూసింది. తల్లి శరీరానికి చీమలు పట్టినా కుమారులు ఏమాత్రం పట్టించుకోలేదు. వృద్ధాప్యంలో ఆమె ఆలనాపాలనా చూసేందుకు పిల్లల్లో ఒక్కరు కూడా ముందుకురాలేదు. దీంతో ఆ వృద్ధురాలు ఇంటి బయటే ఉండిపోయింది. ఆమెకు చీమలు పడుతున్నప్పటికీ కుమారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు. ఆ స్థితిలో ఆమెను చూసిన వారికి అయ్యో పాపం అంటున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కొమరమ్మ(73) అనే వృద్ధారుల ఇటీవల కింద పడి గాయల పాలైంది. ఇద్దరు కుమారులు ఆసుపత్రిలో చేర్చి చికిత్స పూర్తి కాకముందే ఆ తల్లిని ఇంట్లో వొదిలేసి వెళ్ళిపోయారు. నిస్సహాయత స్థితిలోపడి ఉన్న కొమరమ్మ గాయాన్ని చీమలు, దోమలు పీక్కు తింటున్నాయి. ఇది చూసిన గ్రామస్థులు.. మీరేం మనుషులు అంటూ మీడియాకి సమాచారం ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.