శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 ఆగస్టు 2024 (09:48 IST)

పురుగుల మందు తాగేసిన 32 ఏళ్ల తెలంగాణ రైతు.. ఏమైంది?

suicide
తెలంగాణలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెలంగాణ సర్కారు రైతు రుణమాఫీ చేసినా 32 ఏళ్ల రైతు గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా, రఘునాథపల్లి మండలం కుసుంబాయితండా గ్రామానికి చెందిన 32 ఏళ్ల రైతు గురువారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 
 
కొర్ర ఉమల్‌ ఓ ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీ నుంచి రూ. 8 లక్షల రుణం తీసుకున్నాడని, ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించలేకపోయాడు. ఈ నేపథ్యంలో కొర్ర ఉమల్ అతని గదిలో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే జనగూన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 
 
అక్కడ పరిస్థితి విషమించడంతో వరంగల్‌లోని ఎంజీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.