బోనాలు ప్రారంభం.. రెండు రోజుల పాటు లిక్కర్ షాపులు బంద్
బోనాల సందర్భంగా జులై 28న మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. జూలై 28వ తేదీ ఉదయం 6 గంటల నుంచి జూలై 29వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయనున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి ఉత్తర్వుల్లో తెలిపారు.
బోనాల పండుగను పురస్కరించుకుని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మద్యం దుకాణాలను మూసివేయాలని అవినాష్ మొహంతి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ నగరంలో ఆషాడ మాసం చివరి ఆదివారం బోనాల వేడుకలు ప్రారంభమైనాయి.
ప్రతి ఏడాది అత్యంత వైభవంగా పాతబస్తీ బోనాలు జరుగుతాయి. ఈ బోనాల వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
అందులో భాగంగా నగర కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. అక్రమ మద్యంపైనా నిఘా ఉంటుందని.. ఎవరైనా బ్లాక్‌లో మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.