మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 నవంబరు 2024 (15:17 IST)

హైదరాబాదీ బిర్యానీ తిని అస్వస్థతకు గురైన యువకుడు.. ఏమైందంటే?

Biryani
హైదరాబాద్‌లోని హోటల్స్‌లో నాణ్యత కొరవడింది అనేందుకు ఈ ఘటనే నిదర్శనం. 23 ఏళ్ల యువకుడు శుక్రవారం నేరేడ్‌మెట్‌లోని గ్రీన్ బావర్చి హోటల్‌లో చికెన్ బిర్యానీ తిన్న తర్వాత అనారోగ్యానికి గురయ్యాడు. చికిత్స నిమిత్తం మల్కాజిగిరి ఏరియా ఆసుపత్రిలో చేరాడు. తీవ్ర వాంతులు, విరేచనాలు, జ్వరంతో యువకుడు చికిత్స పొందుతున్నాడు.
 
నవంబర్ 14 సాయంత్రం నెరెడ్‌మెట్‌లోని గ్రీన్ బావర్చిలో చికెన్ బిర్యానీ తిన్న తర్వాత అస్వస్థతకు గురయ్యానని బాధితుడు తెలిపాడు. దయచేసి ఆహార నాణ్యత విషయంలో నిర్లక్ష్యం వహించిన సదరు హోటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆహార భద్రత కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. 
Patient
Patient