సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 14 డిశెంబరు 2023 (19:26 IST)

ఐ లవ్ యూ డాడీ: తెలంగాణ అసెంబ్లీలో కేకలు విని హడలిపోయిన ఎమ్మెల్యేలు, ఏమైంది?

Koushik Reddy
మొన్ననే పార్లమెంటులోకి ఇద్దరు దుండగులు చొరబడి గందరగోళం సృష్టించారు. వాళ్లు లోనికి వచ్చి పొగను వదిలారు. అదేమి పొగ అన్నది తెలుసుకునేవరకూ అంతా ఆందోళన చెందారు. ఆ తర్వాత వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇపుడు తెలంగాణ అసెంబ్లీలో కూడా అలాంటి ఘటన కాదు కానీ వేరేగా జరిగింది.
 
హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో స్పీకర్ ముందు ప్రమాణం చేయడానికి వచ్చారు. ఆయన ప్రమాణం చేస్తుండగా మీడియా గ్యాలరీ నుంచి ఐ లవ్యూ డాడీ అంటూ ఒక్కసారిగా కేకలు వినిపించాయి. ఈ కేకలతో అసెంబ్లీ అంతా ఉలిక్కిపడింది. ఆ కేకలు వస్తున్నవైపుకి అందరూ చూసారు. దీనితో భద్రతా సిబ్బంది వెంటనే కౌశిక్ రెడ్డి కుమార్తెను మీడియా గ్యాలరీ నుంచి విజిటర్స్ గ్యాలరీకి పంపారు. ఎమ్మెల్యే కుమార్తెకి మీడియా గ్యాలరీలోకి ఎలా అనుమతి ఇచ్చారంటూ మీడియా ప్రతినిధులు అసహనం వ్యక్తం చేసారు.